ప్రయాణికుల సౌకర్యాల కోసం IRCTC వెబ్‌సైట్‌ను కొత్త రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. 2026 జూలైలో విడుదల చేసిన బీటా వెర్షన్లో సులభమైన ఇంటర్ఫేస్, తక్కువ బుకింగ్ దశలు, అన్ని తరగతుల సీట్ల లభ్యత వంటి సదుపాయాలు ఉన్నాయి. కొత్త పోర్టల్‌ను కొత్త తరం PRS వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. దీని వల్ల టికెట్ బుకింగ్ అనుభవం మరింత సులభంగా మారుతుంది. రైల్వే టికెట్లకు మాత్రమే కాకుండా, IRCTC తన టూరిజం ప్లాట్‌ఫామ్ ద్వారా ఇతర ప్రయాణ సేవలను కూడా అందిస్తోంది. ఇందులో హోటల్ బుకింగ్‌లు, రిటైరింగ్ రూమ్‌లు, లాంజ్ బుకింగ్‌లు, టూర్ ప్యాకేజీలు, విమాన టికెట్లు, బస్ టికెట్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
