Last Updated:
స్టాక్ మార్కెట్లో IPOల జోరు ఒక్కసారిగా పెరిగింది. సెప్టెంబర్ 9న ఏకంగా ఆరు కంపెనీలు ఒకేసారి IPOలకు రానుండటంతో భారత ప్రైమరీ మార్కెట్లో సరికొత్త రికార్డు నమోదుకానుంది. అంతేకాదు.. ఈ నెలలోనే దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన ఐపీవోలు మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభంలో అంతగా ఊపందుకోని భారతీయ ప్రాథమిక మార్కెట్ (ప్రైమరీ మార్కెట్), ఇప్పుడు ఒక్కసారిగా పరుగులు పెడుతోంది. గతంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా కొంత మందకొడిగా సాగిన కార్పొరేట్ నిధుల సేకరణ ప్రణాళికలు, ఇప్పుడు కంపెనీలు తమ వేగాన్ని విపరీతంగా పెంచడంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇందులో భాగంగానే రాబోయే వారంలో భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఏకంగా ఆరు ప్రారంభ పబ్లిక్ ఆఫర్లు (IPOలు) ప్రారంభం కానుండటం గమనార్హం.

