Last Updated:
శ్రీకృష్ణాజన్మాష్టమి సందర్భంగా యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. దీనిపై ఆమె జోడించిన క్యాప్షన్, వీడియో వైరల్ అవుతోంది.
శ్రీకృష్ణాజన్మాష్టమి సందర్భంగా యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇన్‌స్టాలో వైరల్ అయిన ‘తులసి కోమలవేణి..’ అనే కన్నడ భక్తి గీతానికి రాధా గెటప్ లో డాన్స్ చేస్తూ కనిపించింది. చివరలో ‘కృష్ణుడికి అంతా తెలుసు. నాకు అది చాలు’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనసూయను ఇలా చూసిన నెటిజన్లు మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు. ‘ఆ పాట ఏంటి ఆ డ్రెస్ ఏంటి బుద్ధి ఉందా’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, ఆధ్యాత్మికత భావం కన్నా అందాల ప్రదర్శన అంటే బాగుంటుందేమో ఈ వీడియోకి అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

