Last Updated:
SBI Scholarship 2026: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు SBI భారీ స్కాలర్‌షిప్ అందిస్తోంది. 9వ తరగతి నుంచి విదేశీ విద్య వరకు అర్హతను బట్టి రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు సాయం లభిస్తుంది.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చి, ఉన్నత చదువుల్లో రాణించాలని తపన పడే ప్రతిభావంతులైన విద్యార్థులకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరోసారి అండగా నిలవనుంది. ఎస్‌బిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే ‘ఎస్‌బిఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026-27’ (SBI Platinum Jubilee Asha Scholarship) కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి మొదలుకొని, పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేవారు, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులకు ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థుల చదువును బట్టి కేటగిరీని బట్టి ఏడాదికి కనీసం రూ. 15,000 నుండి గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయడం విశేషం.

