రైల్వే శాఖ హైడ్రోజన్ రైళ్లపై నమ్మకం పెట్టుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. భారతీయ రైల్వేలు తమ ప్రధాన బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో దాదాపు 99 శాతం విద్యుదీకరణ పూర్తి చేశాయి. అయినప్పటికీ కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఇంకా విద్యుత్ లైన్లకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, చారిత్రక వారసత్వ మార్గాలు ఇందులో ఉన్నాయి. విద్యుత్ లైన్లు లేని, పర్యావరణ పరంగా సున్నితమైన మార్గాలకు హైడ్రోజన్ రైళ్లు మంచి పరిష్కారంగా భావిస్తున్నారు. కాల్కా-షిమ్లా రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వంటి అందమైన చారిత్రక మార్గాల్లో భారీ విద్యుత్ స్తంభాలు, హై వోల్టేజ్ వైర్లు ఏర్పాటు చేస్తే అక్కడి సహజ అందం, పర్యావరణానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి మార్గాల్లో పాత డీజిల్ ఇంజిన్లు నడుస్తున్నాయి. ఇవి ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, హానికరమైన పొగ, పెద్ద శబ్దాన్ని విడుదల చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)

