వేసవి, వర్షాకాలంలో ఇళ్లలో బల్లులు కనిపించడం సాధారణమే. కిటికీలు, తలుపులు, గోడల్లోని చిన్న రంధ్రాల ద్వారా ఇవి ఇంట్లోకి వస్తుంటాయి. ఇంట్లో ఉండే దోమలు, ఈగలు, చీమలు వంటి చిన్న కీటకాలు కూడా వాటికి ఆహారంగా మారుతాయి. అయితే బల్లులను చంపాల్సిన అవసరం లేదని, కొన్ని సులభమైన పద్ధతులతో వాటిని బయటకు పంపవచ్చని గృహిణి మణి చెబుతున్నారు.

