దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ (AOT) ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాతలు సందీప్ గణ్ణం, రమ్య గణ్ణం మరియు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనే కలను నెరవేర్చే హృదయాన్ని హత్తుకునే కథతో ఈ సినిమా రూపొందిందని దుల్కర్ పేర్కొన్నారు.ID_SS
Source link
