Last Updated:
పిల్లలు తినే సమతుల్య ఆహారంలో గుడ్డును కూడా చేర్చవచ్చు. అయితే పిల్లలకు గుడ్డు ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎలా ఇవ్వాలి, ఎంత పరిమాణంలో ఇవ్వాలి అనే విషయాల్లో తల్లిదండ్రులకు సందేహాలు ఉండటం సహజమని డాక్టర్లు అంటున్నారు.
గుడ్డు పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి పలు ముఖ్యమైన పోషకాలను అందించే ఆహారం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో ప్రోటీన్, ఐరన్, కోలిన్ వంటి పోషకాలు కీలకంగా ఉంటాయి. అందుకే పిల్లలు తినే సమతుల్య ఆహారంలో గుడ్డును కూడా చేర్చవచ్చు. అయితే పిల్లలకు గుడ్డు ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎలా ఇవ్వాలి, ఎంత పరిమాణంలో ఇవ్వాలి అనే విషయాల్లో తల్లిదండ్రులకు సందేహాలు ఉండటం సహజమని ఏబీసీ హాస్పిటల్ పీడియాట్రిషన్ సురేష్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.

