Last Updated:
మోకాలి చుట్టూ గత ఆపరేషన్ల కారణంగా పెద్ద మచ్చలు ఏర్పడటం, ఎముకలు దెబ్బతినడం, మోకాలి సహజ ఆకారం మారిపోవడం, పాత గాయం వల్ల మోకాలిచిప్ప తీవ్రంగా దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ, మోకాళ్ల మార్పిడి శ్రస్త్ర చికిత్సతో పేషంట్ ఈరోజు లేచి నిలబడుతున్నాడు.
మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.

