ప్రభన్యూస్

Hanuman 2: వైష్ణవ్ తేజ్ హీరోగా హనుమాన్ 2.. ఆడియన్స్‌ని కన్ఫ్యూజ్ చేశారుగా! ఇదీ సంగతి | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

గతంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వల్ విషయంలో గందరగోళం నెలకొంది.

News18
News18

2024 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిన చిత్రం ‘హను-మాన్’. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుని రికార్డులు తిరగరాసింది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ సినిమా సీక్వెల్ విషయంలో టాలీవుడ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

‘హను-మాన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తాజాగా ‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ (HanuMan 2 – The Rise of Vanaras) పేరుతో సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించి సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించనుండగా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి విభిన్న ఫాంటసీ చిత్రాలతో గుర్తింపు పొందిన వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఒక కలగా మొదలైన తమ ప్రయాణం మరింత గొప్ప విజన్‌తో కొనసాగుతోందని, ‘హను-మాన్’ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ వైష్ణవ్ తేజ్, వీఐ ఆనంద్‌లతో కలిసి ఓ అద్భుతమైన చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ తాజా ప్రకటనతో గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. ‘హను-మాన్’ ఘనవిజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మకు, నిర్మాత నిరంజన్ రెడ్డికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయనే వార్తలు నెట్టింట జోరుగా ప్రచారమయ్యాయి. ఆ కారణంగానే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులు కలిపి ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రకటించారని అప్పట్లో చర్చ జరిగింది. ఇందులో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పుడు అసలు సిసలైన సీక్వెల్ ఏది అనేది సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఒరిజినల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను తెరకెక్కిస్తుండగా, మరోవైపు ఒరిజినల్ నిర్మాణ సంస్థ ‘హనుమాన్ 2’ను ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకే బ్లాక్‌బస్టర్ చిత్రం వారసత్వంతో రాబోతున్న ఈ రెండు భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 5:46 pm Digital Edition : Prabhanews
Hanuman 2: వైష్ణవ్ తేజ్ హీరోగా హనుమాన్ 2.. ఆడియన్స్‌ని కన్ఫ్యూజ్ చేశారుగా! ఇదీ సంగతి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 21, 2026 5:12 PM ISTగతంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వల్ విషయంలో గందరగోళం నెలకొంది. News182024 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిన చిత్రం ‘హను-మాన్’. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుని రికార్డులు తిరగరాసింది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ సినిమా సీక్వెల్ విషయంలో టాలీవుడ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.‘హను-మాన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తాజాగా ‘హనుమాన్ 2 - ది రైజ్ ఆఫ్ వానరాస్’ (HanuMan 2 – The Rise of Vanaras) పేరుతో సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించి సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించనుండగా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి విభిన్న ఫాంటసీ చిత్రాలతో గుర్తింపు పొందిన వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఒక కలగా మొదలైన తమ ప్రయాణం మరింత గొప్ప విజన్‌తో కొనసాగుతోందని, ‘హను-మాన్’ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ వైష్ణవ్ తేజ్, వీఐ ఆనంద్‌లతో కలిసి ఓ అద్భుతమైన చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
#Vaisshu babu wishing you huge success and happiness with this beautiful project ra, we know how much you struggled in the last couple of years, me and AMMA prayed to our favourite god “LORD HANUMA” and here to our surprise you are doing a movie on his name… thank you for the lovely surprise babu love you loads ❤️
All the best to the whole team 🙏🏼
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 21, 2026ఈ తాజా ప్రకటనతో గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. ‘హను-మాన్’ ఘనవిజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మకు, నిర్మాత నిరంజన్ రెడ్డికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయనే వార్తలు నెట్టింట జోరుగా ప్రచారమయ్యాయి. ఆ కారణంగానే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులు కలిపి ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రకటించారని అప్పట్లో చర్చ జరిగింది. ఇందులో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఇప్పుడు అసలు సిసలైన సీక్వెల్ ఏది అనేది సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఒరిజినల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను తెరకెక్కిస్తుండగా, మరోవైపు ఒరిజినల్ నిర్మాణ సంస్థ ‘హనుమాన్ 2’ను ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకే బ్లాక్‌బస్టర్ చిత్రం వారసత్వంతో రాబోతున్న ఈ రెండు భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.మరింత చదవండి

Source link