bullions.co.in వెల్లడించిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం.. నవంబర్ 16వ తేదీ సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,100గా ఉంది. నవంబర్ 22వ తేదీ నాటికి ఈ ధర రూ.1,22,500కు పడిపోయింది. అంటే కేవలం ఆరు రోజుల్లోనే తులం బంగారంపై రూ.12,600 తగ్గింది. గత రెండు నెలలతో పోల్చినా ఈ వారం నమోదైన పతనం చాలా ఎక్కువగా ఉంది. బంగారం కొనాలనుకునేవారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. నగల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. నవంబర్ 22 నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,12,290కు చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.లక్ష దిగువకు పడిపోయింది. దీంతో తక్కువ బడ్జెట్‌లో బంగారు ఆభరణాలు కొనాలనుకునేవారికి ఈ ధరలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. అయితే నగలు కొనేటప్పుడు బంగారం ధరతో పాటు తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)

