Last Updated:
లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు అంటే ఎలాంటి వార్షిక ఫీజు ఉండదు కాబట్టి దాన్ని ఎప్పటికీ ఉంచుకోవచ్చా? ఏళ్లుగా వాడని కార్డును క్లోజ్ చేస్తే మీ CIBIL స్కోర్‌పై ప్రభావం పడుతుందా? కార్డు క్లోజ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే.
Free Credit Card: లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు అంటే సాధారణంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా కనిపిస్తుంది. వార్షిక రుసుము ఉండదు, రెన్యువల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఒకసారి తీసుకున్న కార్డును ఎప్పటికీ కొనసాగించాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. అయితే సంవత్సరాలుగా ఇలాంటి కార్డులు ఎక్కువగా పేరుకుపోతే వాటిని నిర్వహించడం మరో సమస్యగా మారొచ్చు. అందుకే మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని CIBIL సూచిస్తోంది.

