Last Updated:
Flipkart Jobs: పండుగ సీజన్‌కు ముందే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించినట్లు ప్రకటించింది. ఇందులో 75 వేల పోస్టులు తొలిసారి ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టేవారికి అందుబాటులో ఉండనున్నాయి.
పండుగ సీజన్ ప్రారంభానికి ముందే దేశంలో ఈ-కామర్స్ వ్యాపారం జోరందుకుంటోంది. పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ-కామర్స్ సంస్థలు తమ సరఫరా వ్యవస్థను విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. రాబోయే పండుగ సీజన్లో పెరగనున్న కస్టమర్ డిమాండ్‌ను తీర్చేందుకు దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించినట్లు మంగళవారం తెలిపింది.

