Last Updated:
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. రెడ్మీ నుంచి రెండు కొత్త మొబైల్స్ వచ్చేశాయి. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రెడ్మీ నోట్ 17 ప్రో, రెడ్మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ రిలీజ్ అయ్యాయి.
రెడ్మీ నోట్ 17 సిరీస్‌లో కొత్తగా రెడ్మీ నోట్ 17 ప్రో, రెడ్మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ ఫోన్లు భారత్‌లో లాంచ్ అయ్యాయి. భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఏఎంఓఎల్‌ఈడీ డిస్ప్లేతో వచ్చిన ఈ రెండు ఫోన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. రెడ్మీ నోట్ 17 ప్రోలో 6.83 అంగుళాల 1.5కే ఏఎంఓఎల్‌ఈడీ డిస్ప్లే ఉంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 12-బిట్ డిస్ప్లే కావడంతో 68.7 బిలియన్ రంగులను చూపించగలదు. గరిష్ఠంగా 3,500 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. హై బ్రైట్నెస్ మోడ్‌లో 2,000 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఉంది. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉన్నాయి. వెనుక కెమెరా మాడ్యూల్ కొంచెం చతురస్రాకారంలో ఉంటుంది. కెమెరాలు పైకి కనిపించే పిల్ ఆకారపు భాగంలో అమర్చారు. ఫ్లాట్ ప్లాస్టిక్ ఫ్రేమ్, గుండ్రటి అంచులు, ప్లాస్టిక్ బ్యాక్ప్లేట్ ఉన్నాయి. ఫోన్ మందం సుమారు 8.6 మిల్లీమీటర్లు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్స్ ఉన్నాయి.

