సాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ కొనాలని చూస్తున్న వారికి అలర్ట్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఫోన్ ధర రూ.50,000 కంటే తక్కువకు రానుంది. ప్రస్తుతం ఉన్న ఎంఆర్‌పీతో పోలిస్తే ఇది భారీ డిస్కౌంట్. సాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ బేస్ మోడల్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ఎంఆర్‌పీ రూ.89,999. ఇక 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఆర్‌పీ రూ.99,999గా ఉంది. టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ఎంఆర్‌పీ రూ.1,19,999. ఈ స్మార్ట్‌ఫోన్ ఐసీబ్లూ, జెట్‌బ్లాక్, నేవీ, వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (image: Samsung India)

