రైతులకు కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే పంటల బీమా, పీఎం కిసాన్ యోజన, పంటనష్ట పరిహారం, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు, ఎరువుల కొనుగోలు, వివిధ రకాల పంటల మద్దతు ధరలు పొందడానికి మీరు అర్హులు కారని వివరించారు. ఈ ప్రయోజనాలన్నీ కోల్పోకుండా ఉండాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డ్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్, పొలం పాస్ బుక్ తీసుకుని సమీపంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
