ఇకపై వాట్సాప్‌లోనే కరెంట్, గ్యాస్, నీటి బిల్లులు చెల్లించుకోవచ్చు. అంతేకాదు, ఫాస్ట్‌ట్యాగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, లోన్ ఈఎంఐలు కూడా నేరుగా యాప్‌లోనే చెల్లించే సదుపాయం రానుంది. భారత్‌లో ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సాప్‌లో బిల్ పేమెంట్స్ ఫీచర్‌ను భారత్‌లో ప్రారంభించినట్లు కంపెనీ సెప్టెంబర్ 3న ప్రకటించింది. దీంతో రోజువారీ ఇంటి ఖర్చులకు సంబంధించిన యుటిలిటీ బిల్లులను మరో యాప్‌కు వెళ్లకుండా నేరుగా వాట్సాప్‌లోనే చూసి, మేనేజ్ చేసి, చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను దేశవ్యాప్తంగా దశలవారీగా అందిస్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఇది అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

