Last Updated:
నేపాల్‌లో భోటే కోషి వరదలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు 1,259 మృతదేహాలు వెలికితీయగా, మరో 5 వేల మంది ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.
నేపాల్ దేశాన్ని భోటే కోషి నది వరదలు అతలాకుతలం చేశాయి. వరదలు సృష్టించిన ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDRRMA) గురువారం రాత్రి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 1,259 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా దాదాపు 5,083 మంది అచూకీ దొరకలేదు. ఈ విపత్తులో 5,384 మంది తీవ్రంగా గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద, బురదలో కూరుకుపోయిన వారి కోసం 21 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

