Egg Tips: మన రోజువారీ ఆహారంలో గుడ్డు అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ ఫుడ్. తక్కువ ధరలో శరీరానికి అవసరమైన హై-క్వాలిటీ ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను అందించడంలో గుడ్డుకు సాటి మరొకటి లేదు. అందుకే జిమ్ చేసే యువత నుండి పిల్లలు, పెద్దల వరకు ప్రతిరోజూ గుడ్లు తింటుంటారు. అయితే గుడ్డును తినే పద్ధతిలో లేదా వండే విధానంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడతాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ సీనియర్ క్లినికల్ డైటీషియన్ డాక్టర్ ఎస్. స్వాతి హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఉడికించకపోవడం లేదా తప్పుడు ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. గుడ్లు తినేటప్పుడు అస్సలు చేయకూడని ఆ 5 ప్రమాదకరమైన తప్పుల పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

