మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్, యాక్టీవ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉన్న ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బోట్ నిర్వాణ అయాన్ ఏఎన్సీ ప్రో వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఆకర్షణీయమైన ధరకు అందుబాటులో ఉన్నాయి. హై-రెస్ ఆడియో, ఎల్డీఏసీ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్సీ), 120 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ అసలు ధర (ఎంఆర్పీ) రూ.13,990 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో రూ.2,299కు లిస్ట్ అయ్యాయి. అర్హత ఉన్న బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే, కొన్ని ముఖ్యమైన షరతులు ఉండటంతో వీటిని రూ.2,000కే కొనొచ్చు. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మంచి ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వారికి ఈ డీల్ ఉపయోగపడొచ్చు. (image: Amazon India)

