ప్రభన్యూస్

Dorothy OTT Release: ఓటీటీలోకి కార్తీక్ సుబ్బరాజ్ విలక్షణ చిత్రం ‘డోరతీ’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కీర్తి సురేష్, సనంత్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన విలక్షణ చిత్రం ‘డోరతీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

News18
News18

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విలక్షణ క్రైమ్ డ్రామా చిత్రం ‘డోరతీ’ డిజిటల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్‌తో పాటు సనంత్, రిషికాంత్, సౌందరరాజన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రీమియర్ ప్రదర్శన పొంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతుండటం విశేషం.

5 భాషల్లో స్ట్రీమింగ్

ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. సౌత్ ఇండియాతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా నెట్‌ఫ్లిక్స్ ఈ బహుభాషా విడుదలను ప్లాన్ చేసింది. ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికే శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

1990ల నాటి మధురై నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, సమాజంలో ట్రాన్స్‌జెండర్ వర్గం ఎదుర్కొన్న జీవిత పోరాటాలు, భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించింది. రొటీన్ కమర్షియల్ హంగులకు భిన్నంగా వాస్తవిక దృక్కోణంలో బలమైన కథాంశంతో రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి చూపించారు.

తీవ్రమైన భావోద్వేగాలు, సున్నితమైన కథాంశం ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ కేటాయించింది. థియేటర్లలో చూడలేకపోయిన సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం సినిమాపై మరింత క్రేజ్ పెంచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 10:51 pm Digital Edition : Prabhanews
Dorothy OTT Release: ఓటీటీలోకి కార్తీక్ సుబ్బరాజ్ విలక్షణ చిత్రం ‘డోరతీ’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 18, 2026 10:50 PM ISTకీర్తి సురేష్, సనంత్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన విలక్షణ చిత్రం ‘డోరతీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.News18కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విలక్షణ క్రైమ్ డ్రామా చిత్రం ‘డోరతీ’ డిజిటల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్‌తో పాటు సనంత్, రిషికాంత్, సౌందరరాజన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రీమియర్ ప్రదర్శన పొంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతుండటం విశేషం.5 భాషల్లో స్ట్రీమింగ్ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. సౌత్ ఇండియాతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా నెట్‌ఫ్లిక్స్ ఈ బహుభాషా విడుదలను ప్లాన్ చేసింది. ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికే శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.1990ల నాటి మధురై నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, సమాజంలో ట్రాన్స్‌జెండర్ వర్గం ఎదుర్కొన్న జీవిత పోరాటాలు, భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించింది. రొటీన్ కమర్షియల్ హంగులకు భిన్నంగా వాస్తవిక దృక్కోణంలో బలమైన కథాంశంతో రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి చూపించారు.తీవ్రమైన భావోద్వేగాలు, సున్నితమైన కథాంశం ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ కేటాయించింది. థియేటర్లలో చూడలేకపోయిన సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం సినిమాపై మరింత క్రేజ్ పెంచింది.మరింత చదవండి

Source link