ప్రభన్యూస్

Diwali Cleaning: దీపావళికి ఇల్లు శుభ్రం చేస్తున్నారా.. ఫ్యాన్ విషయంలో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు..! | లైఫ్ స్టైల్


Last Updated:

దీపావళి శుభ్రతలో భాగంగా ఫ్యాన్లపై దుమ్ము సులభంగా ఎలా తొలగించవచ్చో గృహిణి స్వరూప తెలిపారు. పాత దిండు కవర్ ఉపయోగిస్తే దుమ్ము కింద పడకుండా శుభ్రం చేయవచ్చు.

News18
News18

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ శుభ్రత పనులు మొదలవుతాయి. ఇల్లు మొత్తం శుభ్రం చేయడం, కిటికీలు, తలుపులు తుడవడం, కర్టెన్లు ఉతకడం, ఫర్నిచర్‌ను శుభ్రం చేయడం ఇలా ఎన్నో పనులతో గృహిణులు బిజీగా ఉంటారు. అయితే, ఇంత హడావుడిలో చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతుంటారు. అదే ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ల శుభ్రత. పైకి చూస్తే శుభ్రంగానే కనిపించే ఫ్యాన్ రెక్కలపై పెద్ద మొత్తంలో దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. ఫ్యాన్ ఆన్ చేయగానే ఆ దుమ్ము గది మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే దీపావళికి ముందు ఫ్యాన్లను కూడా తప్పనిసరిగా శుభ్రం చేయాలని శ్రీకాకుళానికి చెందిన గృహిణి స్వరూప సూచిస్తున్నారు అవేంటో ఈ కథనంలో చూద్దాం.

సాధారణంగా ఫ్యాన్ శుభ్రం చేయాలంటే దానిని విప్పాల్సి వస్తుందని చాలామంది భావిస్తుంటారు. మరికొందరైతే ఫ్యాన్‌పై ఉన్న దుమ్ము కింద పడుతుందని, దాంతో మళ్లీ ఇల్లు శుభ్రం చేసుకోవాల్సి వస్తుందని వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా చాలా సులభంగా ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం ఇంట్లో ఉండే పాత దిండు కవర్ చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా ఫ్యాన్ రెక్కకు దిండు కవర్‌ను తొడిగి, నెమ్మదిగా బయటకు లాగాలి. ఇలా చేయడం వల్ల రెక్కపై పేరుకుపోయిన దుమ్ము కవర్ లోపలే చేరుతుంది. అన్ని రెక్కలను ఇదే విధంగా శుభ్రం చేసిన తర్వాత దిండు కవర్‌ను బయటకు తీసుకెళ్లి, లోపల ఉన్న దుమ్మును చెత్తబుట్టలో వేయాలి. దీంతో నేలపై, ఫర్నిచర్‌పై దుమ్ము పడకుండా ఉంటుంది.

అయితే, కొన్ని ఫ్యాన్లపై కేవలం దుమ్ము మాత్రమే కాకుండా జిడ్డు కూడా పేరుకుపోతుంటుంది. ముఖ్యంగా వంటగదిలో ఉండే ఫ్యాన్లపై నూనె ఆవిరి, పొగ కారణంగా మొండి మరకలు ఏర్పడతాయి. అలాంటప్పుడు కేవలం దిండు కవర్‌తో శుభ్రం చేస్తే సరిపోదు. ముందుగా పొడి గుడ్డతో దుమ్మును తొలగించాలి. ఆ తర్వాత కొద్దిగా తడి గుడ్డకు సాధారణ క్లీనర్‌ను ఉపయోగించి రెక్కలను సున్నితంగా తుడవాలి. అయితే క్లీనర్‌ను నేరుగా ఫ్యాన్‌పై స్ప్రే చేయకూడదు. అలా చేస్తే ద్రవం ఫ్యాన్‌లోని విద్యుత్ భాగాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. రెక్కలపై ఎక్కువ జిడ్డు ఉంటే దిండు కవర్ లోపలి భాగాన్ని కొద్దిగా తడిపి శుభ్రం చేయవచ్చు.

ఫ్యాన్‌ను శుభ్రం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా స్విచ్ ఆఫ్ చేసి, ఫ్యాన్ పూర్తిగా ఆగిపోయిన తర్వాతే శుభ్రపరిచే పనిని ప్రారంభించాలి. శుభ్రం చేసేటప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించకూడదు. అలాగే ఫ్యాన్ రెక్కలపై గట్టిగా ఒత్తిడి చేయడం, వాటిని బలంగా లాగడం వంటివి చేయకూడదు. దీనివల్ల రెక్కలు వంగిపోయి ఫ్యాన్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. శుభ్రం చేసిన తర్వాత రెక్కలు పూర్తిగా ఆరే వరకు ఫ్యాన్‌ను ఆన్ చేయకూడదు. తడి ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము మళ్లీ త్వరగా అంటుకునే అవకాశం ఉంటుంది.

ఇక ఫ్యాన్‌ను ఎప్పుడు శుభ్రం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన నియమం లేకపోయినా, రెక్కలపై దుమ్ము కనిపించినప్పుడు వెంటనే శుభ్రం చేయడం మంచిది. సాధారణంగా నెలకు ఒకసారి ఫ్యాన్‌ను శుభ్రం చేస్తే దుమ్ము ఎక్కువగా పేరుకుపోకుండా ఉంటుంది. అయితే ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా, కిటికీలు ఎక్కువసేపు తెరిచి ఉంచినా, ఇంటి సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్నా దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. అలాంటి సందర్భాల్లో నెలకు ఒకసారి కంటే ఎక్కువసార్లు శుభ్రం చేయాల్సి రావచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఫ్యాన్‌ను శుభ్రం చేసిన తర్వాత కూడా అది ఊగుతున్నట్లు, వింత శబ్దాలు చేస్తున్నా లేదా గాలి తక్కువగా ఇస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. ఫ్యాన్ రెక్కలు వదులవడం, బేరింగ్స్ దెబ్బతినడం లేదా మోటారులో సమస్యలు ఏర్పడటం ఇందుకు కారణాలు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో సొంతంగా మరమ్మతులు చేయకుండా నిపుణులతో తనిఖీ చేయించుకోవాలి. మొత్తానికి దీపావళి శుభ్రతలో నేలలు, గోడలు, కిటికీలతో పాటు సీలింగ్ ఫ్యాన్లను కూడా మర్చిపోవద్దు. చిన్న దిండు కవర్‌తో పెద్ద పనిని సులభంగా పూర్తి చేసుకోవచ్చని స్వరూప చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 2:47 pm Digital Edition : Prabhanews
Diwali Cleaning: దీపావళికి ఇల్లు శుభ్రం చేస్తున్నారా.. ఫ్యాన్ విషయంలో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు..! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 30, 2026 2:39 PM ISTదీపావళి శుభ్రతలో భాగంగా ఫ్యాన్లపై దుమ్ము సులభంగా ఎలా తొలగించవచ్చో గృహిణి స్వరూప తెలిపారు. పాత దిండు కవర్ ఉపయోగిస్తే దుమ్ము కింద పడకుండా శుభ్రం చేయవచ్చు.News18దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ శుభ్రత పనులు మొదలవుతాయి. ఇల్లు మొత్తం శుభ్రం చేయడం, కిటికీలు, తలుపులు తుడవడం, కర్టెన్లు ఉతకడం, ఫర్నిచర్‌ను శుభ్రం చేయడం ఇలా ఎన్నో పనులతో గృహిణులు బిజీగా ఉంటారు. అయితే, ఇంత హడావుడిలో చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతుంటారు. అదే ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ల శుభ్రత. పైకి చూస్తే శుభ్రంగానే కనిపించే ఫ్యాన్ రెక్కలపై పెద్ద మొత్తంలో దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. ఫ్యాన్ ఆన్ చేయగానే ఆ దుమ్ము గది మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే దీపావళికి ముందు ఫ్యాన్లను కూడా తప్పనిసరిగా శుభ్రం చేయాలని శ్రీకాకుళానికి చెందిన గృహిణి స్వరూప సూచిస్తున్నారు అవేంటో ఈ కథనంలో చూద్దాం.సాధారణంగా ఫ్యాన్ శుభ్రం చేయాలంటే దానిని విప్పాల్సి వస్తుందని చాలామంది భావిస్తుంటారు. మరికొందరైతే ఫ్యాన్‌పై ఉన్న దుమ్ము కింద పడుతుందని, దాంతో మళ్లీ ఇల్లు శుభ్రం చేసుకోవాల్సి వస్తుందని వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా చాలా సులభంగా ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం ఇంట్లో ఉండే పాత దిండు కవర్ చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా ఫ్యాన్ రెక్కకు దిండు కవర్‌ను తొడిగి, నెమ్మదిగా బయటకు లాగాలి. ఇలా చేయడం వల్ల రెక్కపై పేరుకుపోయిన దుమ్ము కవర్ లోపలే చేరుతుంది. అన్ని రెక్కలను ఇదే విధంగా శుభ్రం చేసిన తర్వాత దిండు కవర్‌ను బయటకు తీసుకెళ్లి, లోపల ఉన్న దుమ్మును చెత్తబుట్టలో వేయాలి. దీంతో నేలపై, ఫర్నిచర్‌పై దుమ్ము పడకుండా ఉంటుంది.అయితే, కొన్ని ఫ్యాన్లపై కేవలం దుమ్ము మాత్రమే కాకుండా జిడ్డు కూడా పేరుకుపోతుంటుంది. ముఖ్యంగా వంటగదిలో ఉండే ఫ్యాన్లపై నూనె ఆవిరి, పొగ కారణంగా మొండి మరకలు ఏర్పడతాయి. అలాంటప్పుడు కేవలం దిండు కవర్‌తో శుభ్రం చేస్తే సరిపోదు. ముందుగా పొడి గుడ్డతో దుమ్మును తొలగించాలి. ఆ తర్వాత కొద్దిగా తడి గుడ్డకు సాధారణ క్లీనర్‌ను ఉపయోగించి రెక్కలను సున్నితంగా తుడవాలి. అయితే క్లీనర్‌ను నేరుగా ఫ్యాన్‌పై స్ప్రే చేయకూడదు. అలా చేస్తే ద్రవం ఫ్యాన్‌లోని విద్యుత్ భాగాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. రెక్కలపై ఎక్కువ జిడ్డు ఉంటే దిండు కవర్ లోపలి భాగాన్ని కొద్దిగా తడిపి శుభ్రం చేయవచ్చు.ఫ్యాన్‌ను శుభ్రం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా స్విచ్ ఆఫ్ చేసి, ఫ్యాన్ పూర్తిగా ఆగిపోయిన తర్వాతే శుభ్రపరిచే పనిని ప్రారంభించాలి. శుభ్రం చేసేటప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించకూడదు. అలాగే ఫ్యాన్ రెక్కలపై గట్టిగా ఒత్తిడి చేయడం, వాటిని బలంగా లాగడం వంటివి చేయకూడదు. దీనివల్ల రెక్కలు వంగిపోయి ఫ్యాన్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. శుభ్రం చేసిన తర్వాత రెక్కలు పూర్తిగా ఆరే వరకు ఫ్యాన్‌ను ఆన్ చేయకూడదు. తడి ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము మళ్లీ త్వరగా అంటుకునే అవకాశం ఉంటుంది.ఇక ఫ్యాన్‌ను ఎప్పుడు శుభ్రం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన నియమం లేకపోయినా, రెక్కలపై దుమ్ము కనిపించినప్పుడు వెంటనే శుభ్రం చేయడం మంచిది. సాధారణంగా నెలకు ఒకసారి ఫ్యాన్‌ను శుభ్రం చేస్తే దుమ్ము ఎక్కువగా పేరుకుపోకుండా ఉంటుంది. అయితే ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా, కిటికీలు ఎక్కువసేపు తెరిచి ఉంచినా, ఇంటి సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్నా దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. అలాంటి సందర్భాల్లో నెలకు ఒకసారి కంటే ఎక్కువసార్లు శుభ్రం చేయాల్సి రావచ్చు.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఫ్యాన్‌ను శుభ్రం చేసిన తర్వాత కూడా అది ఊగుతున్నట్లు, వింత శబ్దాలు చేస్తున్నా లేదా గాలి తక్కువగా ఇస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. ఫ్యాన్ రెక్కలు వదులవడం, బేరింగ్స్ దెబ్బతినడం లేదా మోటారులో సమస్యలు ఏర్పడటం ఇందుకు కారణాలు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో సొంతంగా మరమ్మతులు చేయకుండా నిపుణులతో తనిఖీ చేయించుకోవాలి. మొత్తానికి దీపావళి శుభ్రతలో నేలలు, గోడలు, కిటికీలతో పాటు సీలింగ్ ఫ్యాన్లను కూడా మర్చిపోవద్దు. చిన్న దిండు కవర్‌తో పెద్ద పనిని సులభంగా పూర్తి చేసుకోవచ్చని స్వరూప చెబుతున్నారు.మరింత చదవండి

Source link