వెండి పూజలు, బహుమతుల కోసం మంచి ఎంపిక. ధంతేరస్ అంటే బంగారమే కొనాలని లేదు. ఈ పండుగలో వెండికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. వెండి నాణేలు లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించిన వెండి నాణేలను చాలామంది కొనుగోలు చేస్తారు. దీపావళి పూజ సమయంలో వీటిని ఉపయోగిస్తారు. వెండి పాత్రలు, దీపాలు ఇంటి అవసరాలకు, పూజల కోసం వెండి గిన్నెలు, గ్లాసులు, దీపాలు కొంటుంటారు. వెండి విగ్రహాలు చిన్న వెండి విగ్రహాలను కొనుగోలు చేసి ఇంట్లోని పూజ గదిలో ఉంచుకుంటారు. బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉంటుంది. అందుకే తమ బడ్జెట్‌కు మించి ఖర్చు చేయకుండా ధంతేరస్ సంప్రదాయాన్ని పాటించాలనుకునే కుటుంబాలకు వెండి మంచి ఎంపికగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

