ఈ కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన విషయం ఉంది. ఫిర్యాదు ఏ ఫార్మాట్‌లో ఉంది, ఏ భాషలో రాశారు, ఏ మార్గంలో పంపించారు అనే కారణాలతో అధికారులు దాన్ని నమోదు చేయకుండా తిరస్కరించకూడదు. అలాగే, ఫిర్యాదులో ఏదైనా చిన్నపాటి విధానపరమైన లోపం ఉందని చెప్పి కూడా నమోదు చేయకుండా ఉండకూడదు. దీంతో చదువు తక్కువగా ఉన్నవారు, ఆన్‌లైన్ విధానాలు తెలియని వారు కూడా తమ సమస్యలను అధికారులకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన గడువులు విధించింది. ఫిర్యాదు నమోదు అయిన తర్వాత సంబంధిత అధికారి దాన్ని పరిశీలించి అవసరమైన విచారణ చేపట్టాలి. విచారణ కోసం సంబంధిత అధికారుల దగ్గర ఉన్న రికార్డులు, రిజిస్టర్లు, డాక్యుమెంట్లు, నివేదికలు, ఎలక్ట్రానిక్ డేటా, ఇతర సమాచారాన్ని అడిగి తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

