ఖర్జూరం గింజల కాఫీ పొడిని మనం ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. 100 గ్రాముల ప్యాకెట్ సుమారు రూ.200 ఉంటుంది. మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే, ఇంట్లోనే సొంతంగా చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఖర్జూరం తిని, గింజల్ని పారేస్తాం. అవి గట్టిగా ఉంటాయి. వేస్ట్ అనుకుంటాం. కానీ ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. ఆ గింజల్ని సరైన పద్ధతిలో వేయించి గ్రైండ్ చేస్తే అద్భుతమైన కాఫీ పొడి వస్తుంది. ఇది కెఫీన్ ఫ్రీ అయినందున ఎవరైనా తాగవచ్చు. గర్భిణీలు, బీపీ, షుగర్, ఇన్సోమ్నియా ఉన్నవాళ్లు కూడా వాడొచ్చని NDTV రిపోర్ట్ చేసింది.

