భారత్ డిజిటల్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. డిజిటలైజేషన్ కారణంగా వివిధ రంగాల్లో ఉత్పాదకత, పోటీ సామర్థ్యం, సేవలను అందించే విధానం మారుతోంది. డిజిటల్ సేవలు పెరుగుతున్న కొద్దీ కంప్యూటింగ్ సామర్థ్యం, డేటా స్టోరేజ్, వేగవంతమైన కనెక్టివిటీకి డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను తీర్చాలంటే 24 గంటలూ నిరంతరంగా, సురక్షితంగా, పెద్ద స్థాయిలో పనిచేయగల మౌలిక వసతులు అవసరం. ఆ అవసరానికి కీలక పునాదిగా నిలిచేవే డేటా సెంటర్లు. అసలు డేటా సెంటర్ అంటే ఏమిటి? చాలామందికి ఉండే సందేహం ఇది. డేటా సెంటర్ అంటే కంప్యూటర్లు, స్టోరేజ్ పరికరాలు, నెట్‌వర్కింగ్ పరికరాలను సురక్షితంగా ఉంచే ప్రత్యేక కేంద్రం. ఇందులో పెద్ద మొత్తంలో డిజిటల్ సమాచారాన్ని స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం, నిర్వహించడం, అవసరమైన చోటుకు పంపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

