Contraception: గర్భనిరోధక పద్ధతిని ఎలా ఎంచుకోవాలి? మహిళలకు వైద్యుల కీలక సూచనలు | లైఫ్ స్టైల్


Last Updated:

Contraception: గర్భనిరోధక పద్ధతులు కేవలం అనుకోని గర్భధారణను నివారించడానికే కాకుండా మహిళల ఆరోగ్యం, కుటుంబ ప్రణాళికలోనూ కీలకమని మెడికవర్ వైద్యులు తెలిపారు. కాపర్-టీ, హార్మోనల్ ఐయూడీ, పిల్స్, ఇంప్లాంట్లు, కండోమ్స్ వంటి పద్ధతుల్లో తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైనదాన్ని వైద్యుల సలహాతో ఎంచుకోవాలని సూచించారు.

News18
News18

Contraception: గర్భనిరోధకం అంటే కేవలం గర్భధారణను నివారించడం మాత్రమే కాదని, మహిళల ఆరోగ్యం, కుటుంబ ప్రణాళికతో పాటు భవిష్యత్ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్, హైటెక్ సిటీ వైద్యులు తెలిపారు. ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గైనకాలజిస్టులు మహిళలకు గర్భనిరోధక పద్ధతులపై పలు సూచనలు చేశారు.

వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఎంపిక…

ప్రతి మహిళ తన ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ప్రణాళికలు, భవిష్యత్‌లో పిల్లలను కనాలనుకుంటున్న సమయం, వ్యక్తిగత అవసరాలను పరిగణనలోకి తీసుకుని సరైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకోవాలని వైద్యులు సూచించారు. అందుబాటులో ఉన్న ప్రతి పద్ధతి గురించి పూర్తిగా తెలుసుకుని, వైద్యుల సలహాతో నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని తెలిపారు.

సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి & స్త్రీరోగ నిపుణురాలు డా. రాధిక మాట్లాడుతూ.. ప్రస్తుతం కాపర్-టీ, హార్మోనల్ ఐయూడీ, ఇంప్లాంట్లు, గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు, కండోమ్స్ వంటి అనేక గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి పద్ధతికి ప్రత్యేక ప్రయోజనాలు, పరిమితులు ఉంటాయని, అందువల్ల వైద్యుల సూచనతో తమకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవాలని చెప్పారు.

అనుకోని గర్భధారణకు చెక్..

సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి & స్త్రీరోగ నిపుణురాలు డా. వరలక్ష్మి మాట్లాడుతూ.. గర్భనిరోధకం కేవలం కుటుంబ నియంత్రణకు మాత్రమే పరిమితం కాదని తెలిపారు. అనుకోని గర్భధారణలను నివారించడంలోనూ ఇది సహాయపడుతుందని చెప్పారు. మహిళలు తమ ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని గర్భనిరోధక పద్ధతిని ఎంచుకోవాలని సూచించారు.

కండోమ్స్‌తో లైంగిక వ్యాధుల నుంచి రక్షణ…

కండోమ్స్ గర్భధారణను నివారించడంతో పాటు లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే కొన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయని వైద్యులు తెలిపారు. గర్భనిరోధక బాధ్యత మహిళలపైనే ఉండకూడదని, పురుషులు కూడా కుటుంబ నియంత్రణలో భాగస్వాములు కావాలని సూచించారు.

మహిళలు గర్భనిరోధక పద్ధతులపై ఉన్న అపోహలను నమ్మకుండా, సరైన సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. ఏ పద్ధతి తమకు సరిపోతుందో తెలుసుకోవడానికి గైనకాలజిస్టును సంప్రదించడం మంచిదని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో డా. శ్రీవత్స, రీజినల్ మెడికల్ డైరెక్టర్, సుమన్, సెంటర్ హెడ్, డా. స్వాతి, మెడికల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 September 2026, 6:17 pm Digital Edition : Prabhanews
Contraception: గర్భనిరోధక పద్ధతిని ఎలా ఎంచుకోవాలి? మహిళలకు వైద్యుల కీలక సూచనలు | లైఫ్ స్టైల్

Last Updated:Sep 26, 2026 6:00 PM ISTContraception: గర్భనిరోధక పద్ధతులు కేవలం అనుకోని గర్భధారణను నివారించడానికే కాకుండా మహిళల ఆరోగ్యం, కుటుంబ ప్రణాళికలోనూ కీలకమని మెడికవర్ వైద్యులు తెలిపారు. కాపర్-టీ, హార్మోనల్ ఐయూడీ, పిల్స్, ఇంప్లాంట్లు, కండోమ్స్ వంటి పద్ధతుల్లో తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైనదాన్ని వైద్యుల సలహాతో ఎంచుకోవాలని సూచించారు.News18Contraception: గర్భనిరోధకం అంటే కేవలం గర్భధారణను నివారించడం మాత్రమే కాదని, మహిళల ఆరోగ్యం, కుటుంబ ప్రణాళికతో పాటు భవిష్యత్ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్, హైటెక్ సిటీ వైద్యులు తెలిపారు. ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గైనకాలజిస్టులు మహిళలకు గర్భనిరోధక పద్ధతులపై పలు సూచనలు చేశారు.వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఎంపిక...ప్రతి మహిళ తన ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ప్రణాళికలు, భవిష్యత్‌లో పిల్లలను కనాలనుకుంటున్న సమయం, వ్యక్తిగత అవసరాలను పరిగణనలోకి తీసుకుని సరైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకోవాలని వైద్యులు సూచించారు. అందుబాటులో ఉన్న ప్రతి పద్ధతి గురించి పూర్తిగా తెలుసుకుని, వైద్యుల సలహాతో నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని తెలిపారు.సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి & స్త్రీరోగ నిపుణురాలు డా. రాధిక మాట్లాడుతూ.. ప్రస్తుతం కాపర్-టీ, హార్మోనల్ ఐయూడీ, ఇంప్లాంట్లు, గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు, కండోమ్స్ వంటి అనేక గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి పద్ధతికి ప్రత్యేక ప్రయోజనాలు, పరిమితులు ఉంటాయని, అందువల్ల వైద్యుల సూచనతో తమకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవాలని చెప్పారు.అనుకోని గర్భధారణకు చెక్..సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి & స్త్రీరోగ నిపుణురాలు డా. వరలక్ష్మి మాట్లాడుతూ.. గర్భనిరోధకం కేవలం కుటుంబ నియంత్రణకు మాత్రమే పరిమితం కాదని తెలిపారు. అనుకోని గర్భధారణలను నివారించడంలోనూ ఇది సహాయపడుతుందని చెప్పారు. మహిళలు తమ ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని గర్భనిరోధక పద్ధతిని ఎంచుకోవాలని సూచించారు.కండోమ్స్‌తో లైంగిక వ్యాధుల నుంచి రక్షణ...కండోమ్స్ గర్భధారణను నివారించడంతో పాటు లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే కొన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయని వైద్యులు తెలిపారు. గర్భనిరోధక బాధ్యత మహిళలపైనే ఉండకూడదని, పురుషులు కూడా కుటుంబ నియంత్రణలో భాగస్వాములు కావాలని సూచించారు.మహిళలు గర్భనిరోధక పద్ధతులపై ఉన్న అపోహలను నమ్మకుండా, సరైన సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. ఏ పద్ధతి తమకు సరిపోతుందో తెలుసుకోవడానికి గైనకాలజిస్టును సంప్రదించడం మంచిదని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో డా. శ్రీవత్స, రీజినల్ మెడికల్ డైరెక్టర్, సుమన్, సెంటర్ హెడ్, డా. స్వాతి, మెడికల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.మరింత చదవండి

Source link