నిద్రించే సమయంలో మన శరీరం నుంచి వెలువడే చెమట, చర్మంలోని సహజ నూనెలు, జుట్టు నూనె, కొన్నిసార్లు లాలాజలం కూడా దిండు కవర్ను దాటి లోపలికి చేరుతాయి. కాలక్రమేణా ఇవి దిండులో పేరుకుపోయి రంగు మారడానికి కారణమవుతాయి. వీటిలో ఉండే కొవ్వులు, ప్రోటీన్లు, ఉప్పు వంటి పదార్థాలు కూడా మరకలు ఏర్పడటంలో పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా బాడీ లోషన్లు, హెయిర్ కేర్ ఉత్పత్తులు ఉపయోగించిన తర్వాత పడుకోవడం, తడి జుట్టుతో నిద్రించడం వల్ల కూడా దిండుపై తేమ, నూనెలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే దుర్వాసనతో పాటు సూక్ష్మజీవులు, డస్ట్ మైట్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
