ప్రభన్యూస్

Aadarsha Kutumbam: నాకైతే అలాంటి సెంటిమెంట్లు లేవు.. వెంకటేష్ ఓపెన్ స్టేట్‌మెంట్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో వెంకటేశ్ సినిమా గురించి, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

News18
News18

టాలీవుడ్ ప్రేక్షకులకు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. గతంలో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా.. వెంకటేష్ హీరోగా నటించి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ మామ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి ఈ శుక్రవారం (అక్టోబర్ 30) థియేటర్లలో భారీ ఎత్తున సందడి చేయడానికి సిద్ధమైంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో వెంకటేశ్ సినిమా గురించి, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. “నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 ఏళ్లు పైనే అవుతోంది. ఇన్నేళ్లుగా నేను ఇండస్ట్రీలో స్టార్‌గా కొనసాగుతున్నానంటే దానికి ఏకైక కారణం ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అంతులేని ఆదరణ, ప్రేమాభిమానాలే. ప్రేక్షకులు ఎప్పుడూ నాకు అండగా నిలబడుతూ, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా సినిమా బాగుంటే బాగుందని, బాగోకపోతే బాగోలేదని మొహం మీదే నిర్మొహమాటంగా చెబుతారు. నాకు ఎప్పుడూ ఆడియన్స్ తీర్పే ఫైనల్,” అని వెంకీ మామ ఎమోషనల్ అయ్యారు.

ఇదే ప్రెస్ మీట్‌లో విలేకరులు అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు వెంకటేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ మీకు కలిసొస్తుందని భావిస్తున్నారా?” అని ఓ విలేకరి అడగ్గా.. వెంకటేష్ నవ్వుతూ బదులిచ్చారు. “నేను ఇలాంటి సెంటిమెంట్లను పెద్దగా నమ్మను. స్క్రిప్ట్ బాగుండి, సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే విజయం దానంతట అదే వస్తుంది. అంతిమంగా సినిమా విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే,” అని ఆయన స్పష్టం చేశారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే ఛార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసేలా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 11:26 pm Digital Edition : Prabhanews
Aadarsha Kutumbam: నాకైతే అలాంటి సెంటిమెంట్లు లేవు.. వెంకటేష్ ఓపెన్ స్టేట్‌మెంట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 29, 2026 11:10 PM ISTఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో వెంకటేశ్ సినిమా గురించి, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.News18టాలీవుడ్ ప్రేక్షకులకు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. గతంలో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా.. వెంకటేష్ హీరోగా నటించి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ మామ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి ఈ శుక్రవారం (అక్టోబర్ 30) థియేటర్లలో భారీ ఎత్తున సందడి చేయడానికి సిద్ధమైంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో వెంకటేశ్ సినిమా గురించి, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. "నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 ఏళ్లు పైనే అవుతోంది. ఇన్నేళ్లుగా నేను ఇండస్ట్రీలో స్టార్‌గా కొనసాగుతున్నానంటే దానికి ఏకైక కారణం ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అంతులేని ఆదరణ, ప్రేమాభిమానాలే. ప్రేక్షకులు ఎప్పుడూ నాకు అండగా నిలబడుతూ, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా సినిమా బాగుంటే బాగుందని, బాగోకపోతే బాగోలేదని మొహం మీదే నిర్మొహమాటంగా చెబుతారు. నాకు ఎప్పుడూ ఆడియన్స్ తీర్పే ఫైనల్," అని వెంకీ మామ ఎమోషనల్ అయ్యారు.ఇదే ప్రెస్ మీట్‌లో విలేకరులు అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు వెంకటేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ మీకు కలిసొస్తుందని భావిస్తున్నారా?" అని ఓ విలేకరి అడగ్గా.. వెంకటేష్ నవ్వుతూ బదులిచ్చారు. "నేను ఇలాంటి సెంటిమెంట్లను పెద్దగా నమ్మను. స్క్రిప్ట్ బాగుండి, సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే విజయం దానంతట అదే వస్తుంది. అంతిమంగా సినిమా విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే," అని ఆయన స్పష్టం చేశారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే ఛార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసేలా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తెలుస్తోంది.మరింత చదవండి

Source link