Indian Stock Market: భారత్-అమెరికా డీల్ నుంచి GST వరకు.. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలివే? | బిజినెస్
ఈ వారం మార్కెట్‌కు ఊతమిచ్చే ప్రధాన పరిణామాల్లో ఒకటి భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్‌తో సమావేశం అనంతరం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరే దశకు ఇరు దేశాలు చాలా దగ్గరగా వచ్చాయని ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించే…
