Last Updated:
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించడానికి, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ’10-100-1000′ అనే సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను ఆయన ప్రతిపాదించారు.
భారత రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో భాగంగా శుక్రవారం నిర్వహించిన ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’ లీడర్స్ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. వ్యవసాయం నుంచి అంతరిక్షం దాకా బ్రిక్స్ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రశంసించారు. బ్రిక్స్ కూటమి మూడో దశకంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన సభ్య దేశాల ముందు ఒక ప్రతిష్టాత్మక ’10-100-1000′ యాక్షన్ ప్లాన్‌ను ఉంచారు. బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న ప్రధానమైన పది వాణిజ్య అడ్డంకులను తొలగించడంపై ఒక నివేదిక తయారు చేయాలని బిజినెస్ కౌన్సిల్‌ను కోరారు.

