Last Updated:
తల్లికి కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ప్రసవం తర్వాత గర్భాశయం సాధారణ స్థితికి చేరుకునే ప్రక్రియకు సహాయపడతాయి. తల్లిపాలు ఇచ్చే మహిళల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్ ప్రమాదం కొంత తక్కువగా ఉండవచ్చని WHO పేర్కొంటోంది.
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు వచ్చే ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి.. బిడ్డకు తల్లిపాలు ఎంతకాలం ఇవ్వాలి? అనేది. నిపుణుల ప్రకారం, తల్లిపాలు శిశువుకు సహజమైన, పోషకమైన ఆహారం. ఇందులో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, యాంటీబాడీలు వంటి ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఇవి బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివృద్ధికి తోడ్పడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ మొదటి ఆరు నెలల పాటు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నాయి.

