అర్థరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం..
తెలంగాణలో సోమవారం రాత్రి ప్రారంభమైన భారీ వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగి హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. హస్తినాపురం, ఉప్పల్, సరూర్‌నగర్, చార్మినార్, హయత్‌నగర్, గోల్కొండ, నాంపల్లి, బాలాపూర్‌తో పాటు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం సమీపంలో రహదారిపై భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు అంతరాయం కలిగాయి. మోకాలిలోతు నీటితో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనగా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
