సమాజంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ, ధనవంతులు వేసే చెత్త జోకులకు కూడా నవ్వేవాళ్లు ఉన్నారని ఆయన సెటైర్ వేశారు. ఎవరైనా మన గురించి వెనుక మాట్లాడుకుంటున్నారంటే, మనం వారి కంటే ముందున్నామని అర్థం చేసుకోవాలని, అలాంటి వారిని పట్టించుకోకూడదని సూచించారు. కర్మ సిద్ధాంతాన్ని, విధి రాతను తాను బలంగా నమ్ముతానని, తనపై వచ్చే నెగెటివ్ ప్రచారాలు తనను ఏమాత్రం బాధ పెట్టవని ఆయన స్పష్టం చేశారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, మన గురించి మనకు స్పష్టత ఉన్నప్పుడు బయటి విమర్శలు మనల్ని ప్రభావితం చేయలేవని అన్నారు. ఎన్నో కష్టనష్టాలు దాటి ఈ స్థాయికి చేరుకున్న బ్రహ్మానందం మాటల్లోని పరిణతికి నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన కేవలం కమెడియన్ మాత్రమే కాదని, ఒక గొప్ప ఫిలాసఫర్, రియల్ హీరో అని కామెంట్లు చేస్తున్నారు.

