ప్రభన్యూస్

Rayavalasa: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ సందడి.. విశ్వక్ సేన్ చేతుల మీదుగా టైటిల్ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా రాధిక జయంతి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘రాయవలస’. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

News18
News18

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ నటులు అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ సింగిల్‌గా విడుదలైన ‘రింగుడు రింగుడు’ ఆంధ్రా జానపద ఫోక్ సాంగ్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రముఖ గాయకులు ధనుంజయ్, సాహితీ చాగంటి ఆలపించిన ఈ పాట ఇప్పటికే 12 లక్షలకు (1.2 Million) పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.

తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘మా ఊరు రాయవలస’ పాటను విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడటం మరో విశేషం. ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. ‘రాయవలస’ కంటెంట్ బాగుంది. సాంగ్ గొప్పగా ఉంది. రాహుల్ అద్భుతంగా పాడాడు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఆంధ్రా పల్లెటూరి జానపద పాట న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకు చేరుకుంది. డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తూ, అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ‘రింగుడు రింగుడు’ పాట విజువల్స్‌ను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. తొలి సినిమాకే ఇలాంటి వినూత్న ప్రమోషన్స్‌తో రాయవలస టీమ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.

అర్జున్ బాల సంగీతం అందించగా, రాఖీ కథను అందించారు. కిట్టు సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల కలయికతో తెరకెక్కిన ‘రాయవలస’ డిసెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 2:41 pm Digital Edition : Prabhanews
Rayavalasa: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ సందడి.. విశ్వక్ సేన్ చేతుల మీదుగా టైటిల్ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 26, 2026 2:40 PM ISTకార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా రాధిక జయంతి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘రాయవలస’. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.News18రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ నటులు అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ సింగిల్‌గా విడుదలైన ‘రింగుడు రింగుడు’ ఆంధ్రా జానపద ఫోక్ సాంగ్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రముఖ గాయకులు ధనుంజయ్, సాహితీ చాగంటి ఆలపించిన ఈ పాట ఇప్పటికే 12 లక్షలకు (1.2 Million) పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘మా ఊరు రాయవలస’ పాటను విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడటం మరో విశేషం. ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. ‘రాయవలస’ కంటెంట్ బాగుంది. సాంగ్ గొప్పగా ఉంది. రాహుల్ అద్భుతంగా పాడాడు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.ఆంధ్రా పల్లెటూరి జానపద పాట న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకు చేరుకుంది. డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తూ, అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ‘రింగుడు రింగుడు’ పాట విజువల్స్‌ను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. తొలి సినిమాకే ఇలాంటి వినూత్న ప్రమోషన్స్‌తో రాయవలస టీమ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.అర్జున్ బాల సంగీతం అందించగా, రాఖీ కథను అందించారు. కిట్టు సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల కలయికతో తెరకెక్కిన ‘రాయవలస’ డిసెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.మరింత చదవండి

Source link