ప్రభన్యూస్

Bigg Boss 10 Telugu: వర్షిణికి త్రిగుణ్ వెన్నుపోటు, 8వ వారం ఎలిమినేషన్ గండంలో ఉన్నది వీళ్ళే.. | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. హౌస్‌లో ఎప్పుడు ఏ బంధం ముగుస్తుందో, ఎవరు ఎవరికి శత్రువులుగా మారుతారో ఊహించడం కష్టంగా మారింది. తాజాగా ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ సోమ, మంగళవారాల్లో అత్యంత వాడివేడిగా జరిగింది.

News18
News18

‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. హౌస్‌లో ఎప్పుడు ఏ బంధం ముగుస్తుందో, ఎవరు ఎవరికి శత్రువులుగా మారుతారో ఊహించడం కష్టంగా మారింది. తాజాగా ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ సోమ, మంగళవారాల్లో అత్యంత వాడివేడిగా, ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ ఆరేళ్ల స్నేహానికి బీటలు వారేలా చేశాయి. ఇంటి సభ్యుల మధ్య జరిగిన మాటల యుద్ధం, వర్షిణి-త్రిగుణ్ మధ్య జరిగిన ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎనిమిదో వారం నామినేషన్లలో త్రిగుణ్ తీసుకున్న నిర్ణయం హౌస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఆరేళ్లుగా తన ప్రాణ స్నేహితురాలిగా ఉన్న వర్షిణిని త్రిగుణ్ అనూహ్యంగా నామినేట్ చేయడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తన స్నేహితుల కోసం ప్రాణమిచ్చే త్రిగుణ్, తనకు ఇలా వెన్నుపోటు పొడుస్తాడని కలలో కూడా ఊహించలేదని వర్షిణి ఎమోషనల్ అయింది. బయట ఉన్న త్రిగుణ్‌కు, హౌస్‌లో ఉన్న త్రిగుణ్‌కు అసలు పొంతనే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై త్రిగుణ్ నిర్మొహమాటంగా స్పందిస్తూ.. తాను ఇక్కడికి స్నేహం కోసం రాలేదని, కేవలం ఆట కోసం, తన కుటుంబం భవిష్యత్తు కోసం మాత్రమే వచ్చానని కుండబద్దలు కొట్టాడు. స్నేహితుడిగా తాను ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ, ఆటగాడిగా మాత్రం గెలిచానని త్రిగుణ్ చెప్పిన తీరు హౌస్‌లో కొత్త చర్చకు దారితీసింది.

మరోవైపు నరేష్ గేర్ మార్చాడు. వర్షిణి, సింగర్ ఝాన్సీలను టార్గెట్ చేసి తన వాదన వినిపించాడు. ఝాన్సీకి చెప్పిన రీజన్ సిల్లీగా ఉన్నప్పటికీ.. వర్షిణి ఆటలో తన వంద శాతం ఇవ్వడం లేదని, మధ్యలోనే గివ్ అప్ ఇస్తోందని నరేష్ చేసిన ఆరోపణలు వాలిడ్‌గా అనిపించడంతో ఆమె నామినేషన్ ఆమోదం పొందింది. ఇక హౌస్ కెప్టెన్ సుధీర్ రెడ్డిని శివకుమార్ ఏకిపారేశాడు. కెప్టెన్‌గా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వాటిని కప్పిపుచ్చుతూ ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నాడని, బ్లాక్ ఫుట్ వేస్తున్నాడని విమర్శిస్తూ సుధీర్ ను నామినేట్ చేశాడు. మాట మార్చాడంటూ రామ్ ప్రసాద్ శివకుమార్‌ను నామినేట్ చేయగా, తరచూ ఏడుస్తోందంటూ దేబ్జానీకి శ్వేత ఓటు వేసింది. వంద శాతం ఎఫర్ట్ పెట్టనని చెప్పినందుకు నరేష్‌కు రోహిత్, ఆటకంటే క్యారెక్టర్ ముఖ్యం అన్నందుకు వర్షిణికి రామకృష్ణ నామినేషన్లు వేశారు. అలాగే కంబ్యాక్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోలేదని శివకుమార్ ను ఝాన్సీ నామినేట్ చేసింది.

ఇక డేంజర్ లో ఉన్న వంశీ, నరేష్, శ్వేతలలో నుంచి వంశీ నామినేషన్లకు ఎంపికయ్యాడు. మొత్తంగా ఎనిమిదో వారం ఎలిమినేషన్ గండంలో ఎనిమిది మంది సభ్యులు నిలిచారు. సింగర్ ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్ రెడ్డి, రామ్ ప్రసాద్, వర్షిణి, శివకుమార్, వంశీ ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ వారం ఓటింగ్ లో ఎవరు సేఫ్ అవుతారు? త్రిగుణ్ దెబ్బతో ఎమోషనల్ అయిన వర్షిణికి సింపతీ వర్కవుట్ అవుతుందా? అన్నది వీకెండ్ ఎపిసోడ్‌లో తేలనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 10:26 am Digital Edition : Prabhanews
Bigg Boss 10 Telugu: వర్షిణికి త్రిగుణ్ వెన్నుపోటు, 8వ వారం ఎలిమినేషన్ గండంలో ఉన్నది వీళ్ళే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 28, 2026 10:00 AM IST'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. హౌస్‌లో ఎప్పుడు ఏ బంధం ముగుస్తుందో, ఎవరు ఎవరికి శత్రువులుగా మారుతారో ఊహించడం కష్టంగా మారింది. తాజాగా ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ సోమ, మంగళవారాల్లో అత్యంత వాడివేడిగా జరిగింది. News18'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. హౌస్‌లో ఎప్పుడు ఏ బంధం ముగుస్తుందో, ఎవరు ఎవరికి శత్రువులుగా మారుతారో ఊహించడం కష్టంగా మారింది. తాజాగా ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ సోమ, మంగళవారాల్లో అత్యంత వాడివేడిగా, ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ ఆరేళ్ల స్నేహానికి బీటలు వారేలా చేశాయి. ఇంటి సభ్యుల మధ్య జరిగిన మాటల యుద్ధం, వర్షిణి-త్రిగుణ్ మధ్య జరిగిన ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.ఎనిమిదో వారం నామినేషన్లలో త్రిగుణ్ తీసుకున్న నిర్ణయం హౌస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఆరేళ్లుగా తన ప్రాణ స్నేహితురాలిగా ఉన్న వర్షిణిని త్రిగుణ్ అనూహ్యంగా నామినేట్ చేయడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తన స్నేహితుల కోసం ప్రాణమిచ్చే త్రిగుణ్, తనకు ఇలా వెన్నుపోటు పొడుస్తాడని కలలో కూడా ఊహించలేదని వర్షిణి ఎమోషనల్ అయింది. బయట ఉన్న త్రిగుణ్‌కు, హౌస్‌లో ఉన్న త్రిగుణ్‌కు అసలు పొంతనే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై త్రిగుణ్ నిర్మొహమాటంగా స్పందిస్తూ.. తాను ఇక్కడికి స్నేహం కోసం రాలేదని, కేవలం ఆట కోసం, తన కుటుంబం భవిష్యత్తు కోసం మాత్రమే వచ్చానని కుండబద్దలు కొట్టాడు. స్నేహితుడిగా తాను ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ, ఆటగాడిగా మాత్రం గెలిచానని త్రిగుణ్ చెప్పిన తీరు హౌస్‌లో కొత్త చర్చకు దారితీసింది.మరోవైపు నరేష్ గేర్ మార్చాడు. వర్షిణి, సింగర్ ఝాన్సీలను టార్గెట్ చేసి తన వాదన వినిపించాడు. ఝాన్సీకి చెప్పిన రీజన్ సిల్లీగా ఉన్నప్పటికీ.. వర్షిణి ఆటలో తన వంద శాతం ఇవ్వడం లేదని, మధ్యలోనే గివ్ అప్ ఇస్తోందని నరేష్ చేసిన ఆరోపణలు వాలిడ్‌గా అనిపించడంతో ఆమె నామినేషన్ ఆమోదం పొందింది. ఇక హౌస్ కెప్టెన్ సుధీర్ రెడ్డిని శివకుమార్ ఏకిపారేశాడు. కెప్టెన్‌గా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వాటిని కప్పిపుచ్చుతూ 'సేఫ్ గేమ్' ఆడుతున్నాడని, బ్లాక్ ఫుట్ వేస్తున్నాడని విమర్శిస్తూ సుధీర్ ను నామినేట్ చేశాడు. మాట మార్చాడంటూ రామ్ ప్రసాద్ శివకుమార్‌ను నామినేట్ చేయగా, తరచూ ఏడుస్తోందంటూ దేబ్జానీకి శ్వేత ఓటు వేసింది. వంద శాతం ఎఫర్ట్ పెట్టనని చెప్పినందుకు నరేష్‌కు రోహిత్, ఆటకంటే క్యారెక్టర్ ముఖ్యం అన్నందుకు వర్షిణికి రామకృష్ణ నామినేషన్లు వేశారు. అలాగే కంబ్యాక్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోలేదని శివకుమార్ ను ఝాన్సీ నామినేట్ చేసింది.ఇక డేంజర్ లో ఉన్న వంశీ, నరేష్, శ్వేతలలో నుంచి వంశీ నామినేషన్లకు ఎంపికయ్యాడు. మొత్తంగా ఎనిమిదో వారం ఎలిమినేషన్ గండంలో ఎనిమిది మంది సభ్యులు నిలిచారు. సింగర్ ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్ రెడ్డి, రామ్ ప్రసాద్, వర్షిణి, శివకుమార్, వంశీ ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ వారం ఓటింగ్ లో ఎవరు సేఫ్ అవుతారు? త్రిగుణ్ దెబ్బతో ఎమోషనల్ అయిన వర్షిణికి సింపతీ వర్కవుట్ అవుతుందా? అన్నది వీకెండ్ ఎపిసోడ్‌లో తేలనుంది.మరింత చదవండి

Source link