ప్రభన్యూస్

Nara Lokesh: బాలకృష్ణ టాప్ సీక్రెట్స్ బయటపెట్టిన నారా లోకేష్.. మామ, అల్లుళ్ళు మామూలు కాదబ్బా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

వెండితెరపై సింహంలా గర్జించే బాలయ్య బాబు సైతం నిజ జీవితంలో ఒకే ఒక్కరికి భయపడతారంటూ లోకేష్ గుట్టు విప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్ ఎప్పుడూ రాజకీయ వ్యూహాలు, సమీక్షలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉంటారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలుపొంది, ‘యువగళం’ పాదయాత్రతో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇప్పుడు ఓ సరికొత్త వినోదాత్మక కోణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 కు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. రాజకీయ నాయకుడిగా సీరియస్ లుక్ లో కనిపించే లోకేష్.. ఈ షోలో నవ్వులు పూయిస్తూ, మాస్ డైలాగులతో అదరగొట్టారు.

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను, వారిలోని సరదా కోణాన్ని బయటకు తీసుకురావడంలో హోస్ట్ జగపతిబాబు ఎప్పుడూ ముందుంటారు. ఈ ప్రోమోలో లోకేష్‌ను ఆహ్వానిస్తూ.. “ప్రజలే దేవుళ్లు అంటూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన యువగళం నారా లోకేష్” అంటూ జగ్గూభాయ్ ఇచ్చిన ఎలివేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. వేదికపైకి రాగానే ఏమాత్రం బెదురు లేకుండా ఉత్సాహంగా, ‘జై బాలయ్య’ అంటూ అభిమానులతో కలిసి లోకేష్ నినాదాలు చేయడం ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది. ఈ షోలో లోకేష్ తన బాల్య స్మృతులను, స్కూల్ లైఫ్ ను నెమరువేసుకున్నారు. స్కూల్లో అందరికంటే ఎక్కువగా ఉపాధ్యాయుల చేతిలో దెబ్బలు తిన్నది తానేనని ఆయన ఫ్రాంక్ గా ఒప్పుకుని నవ్వించారు. అంత అల్లరి ఎందుకు చేసేవారని జగపతిబాబు అడగగా.. “మరి అప్పుడప్పుడు మావయ్య బాలకృష్ణతో కూడా పోటీ పడాలి కదా” అంటూ ఆయన ఇచ్చిన కౌంటర్ కు సెట్ అంతా నవ్వులతో దద్దరిల్లింది. తన పెళ్లి సమయంలో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను కూడా పంచుకున్నారు. “నన్ను ఎవరైనా అల్లుడుగారు అని పిలిచారంటే.. ఏదో పెద్ద ఫిట్టింగ్ పెడుతున్నారనుకునేవాడిని” అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.

ఇక నందమూరి బాలకృష్ణ గురించిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్ ను లోకేష్ ఈ వేదికపై లీక్ చేశారు. వెండితెరపై సింహంలా గర్జించే బాలయ్య బాబు సైతం నిజ జీవితంలో ఒకే ఒక్కరికి భయపడతారంటూ లోకేష్ ఓ గుట్టు విప్పారు. ఆ ఏకైక వ్యక్తి ఎవరు? అన్నది ప్రోమోలో సస్పెన్స్ గా ఉంచారు. ఆ సీక్రెట్ తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అన్నింటికీ మించి ప్రోమో చివర్లో లోకేష్ మాస్ అవతార్ లోకి మారిపోయారు. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘లెజెండ్’లోని పవర్ ఫుల్ డైలాగ్ “ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు” అంటూ లోకేష్ చెప్పిన తీరు నందమూరి, టీడీపీ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు సెలబ్రిటీ టాక్ షోలకు వచ్చి యువతకు మరింత చేరువవుతున్నారు. గతంలో ‘అన్‌స్టాపబుల్’ షోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వారు పాల్గొని తమలోని తెలియని కోణాలను ఆవిష్కరించారు. ఇప్పుడు అదే తరహాలో నారా లోకేష్ ఈ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో ద్వారా తనదైన చమత్కారాన్ని ప్రదర్శించనున్నారు. కేవలం రాజకీయాలే కాకుండా వ్యక్తిగత అనుభవాలు, ఫ్యామిలీ బాండింగ్, సినీ కబుర్లతో సాగిన ఈ ఎపిసోడ్ నవంబర్ 6న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (Zee5)లో ప్రీమియర్ కానుంది. ఆ తర్వాత నవంబర్ 8న రాత్రి 7:30 గంటలకు ‘జీ తెలుగు’ (Zee Telugu) ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 10:47 am Digital Edition : Prabhanews
Nara Lokesh: బాలకృష్ణ టాప్ సీక్రెట్స్ బయటపెట్టిన నారా లోకేష్.. మామ, అల్లుళ్ళు మామూలు కాదబ్బా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 28, 2026 10:41 AM ISTవెండితెరపై సింహంలా గర్జించే బాలయ్య బాబు సైతం నిజ జీవితంలో ఒకే ఒక్కరికి భయపడతారంటూ లోకేష్ గుట్టు విప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. News18ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్ ఎప్పుడూ రాజకీయ వ్యూహాలు, సమీక్షలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉంటారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలుపొంది, 'యువగళం' పాదయాత్రతో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇప్పుడు ఓ సరికొత్త వినోదాత్మక కోణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 కు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. రాజకీయ నాయకుడిగా సీరియస్ లుక్ లో కనిపించే లోకేష్.. ఈ షోలో నవ్వులు పూయిస్తూ, మాస్ డైలాగులతో అదరగొట్టారు.సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను, వారిలోని సరదా కోణాన్ని బయటకు తీసుకురావడంలో హోస్ట్ జగపతిబాబు ఎప్పుడూ ముందుంటారు. ఈ ప్రోమోలో లోకేష్‌ను ఆహ్వానిస్తూ.. "ప్రజలే దేవుళ్లు అంటూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన యువగళం నారా లోకేష్" అంటూ జగ్గూభాయ్ ఇచ్చిన ఎలివేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. వేదికపైకి రాగానే ఏమాత్రం బెదురు లేకుండా ఉత్సాహంగా, ‘జై బాలయ్య’ అంటూ అభిమానులతో కలిసి లోకేష్ నినాదాలు చేయడం ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది. ఈ షోలో లోకేష్ తన బాల్య స్మృతులను, స్కూల్ లైఫ్ ను నెమరువేసుకున్నారు. స్కూల్లో అందరికంటే ఎక్కువగా ఉపాధ్యాయుల చేతిలో దెబ్బలు తిన్నది తానేనని ఆయన ఫ్రాంక్ గా ఒప్పుకుని నవ్వించారు. అంత అల్లరి ఎందుకు చేసేవారని జగపతిబాబు అడగగా.. "మరి అప్పుడప్పుడు మావయ్య బాలకృష్ణతో కూడా పోటీ పడాలి కదా" అంటూ ఆయన ఇచ్చిన కౌంటర్ కు సెట్ అంతా నవ్వులతో దద్దరిల్లింది. తన పెళ్లి సమయంలో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను కూడా పంచుకున్నారు. "నన్ను ఎవరైనా అల్లుడుగారు అని పిలిచారంటే.. ఏదో పెద్ద ఫిట్టింగ్ పెడుతున్నారనుకునేవాడిని" అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.ఇక నందమూరి బాలకృష్ణ గురించిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్ ను లోకేష్ ఈ వేదికపై లీక్ చేశారు. వెండితెరపై సింహంలా గర్జించే బాలయ్య బాబు సైతం నిజ జీవితంలో ఒకే ఒక్కరికి భయపడతారంటూ లోకేష్ ఓ గుట్టు విప్పారు. ఆ ఏకైక వ్యక్తి ఎవరు? అన్నది ప్రోమోలో సస్పెన్స్ గా ఉంచారు. ఆ సీక్రెట్ తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అన్నింటికీ మించి ప్రోమో చివర్లో లోకేష్ మాస్ అవతార్ లోకి మారిపోయారు. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘లెజెండ్’లోని పవర్ ఫుల్ డైలాగ్ "ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు" అంటూ లోకేష్ చెప్పిన తీరు నందమూరి, టీడీపీ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు సెలబ్రిటీ టాక్ షోలకు వచ్చి యువతకు మరింత చేరువవుతున్నారు. గతంలో 'అన్‌స్టాపబుల్' షోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వారు పాల్గొని తమలోని తెలియని కోణాలను ఆవిష్కరించారు. ఇప్పుడు అదే తరహాలో నారా లోకేష్ ఈ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో ద్వారా తనదైన చమత్కారాన్ని ప్రదర్శించనున్నారు. కేవలం రాజకీయాలే కాకుండా వ్యక్తిగత అనుభవాలు, ఫ్యామిలీ బాండింగ్, సినీ కబుర్లతో సాగిన ఈ ఎపిసోడ్ నవంబర్ 6న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (Zee5)లో ప్రీమియర్ కానుంది. ఆ తర్వాత నవంబర్ 8న రాత్రి 7:30 గంటలకు ‘జీ తెలుగు’ (Zee Telugu) ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది.మరింత చదవండి

Source link