Last Updated:
భారత్ ఛార్జ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 80+ EV ఛార్జింగ్ స్టేషన్లు, 160+ ఛార్జర్‌లను విస్తరిస్తోంది. రైల్వే స్టేషన్లు, హైవేలపై దృష్టి సారించి, హైదరాబాద్-చెన్నై మార్గంలో ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వేగవంతమైన, నమ్మకమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై హైదరాబాద్‌కు చెందిన ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ భారత్ ఛార్జ్ (Bharat Charge) దృష్టి సారించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న సంస్థ.. రైల్వే స్టేషన్లు, హైవేలు, మాల్స్, రెసిడెన్షియల్ కమ్యూనిటీలు, కార్పొరేట్ క్యాంపస్‌లు, కమర్షియల్ ప్రాంతాలను కీలక ప్రదేశాలుగా ఎంచుకుంటోంది. DPIIT గుర్తింపు పొందిన, T-Hubలో ఇంక్యుబేట్ అయిన ఈ స్టార్టప్.. కేవలం ఛార్జర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఛార్జ్ పాయింట్ ఆపరేటర్‌గా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, సొంతం చేసుకుని నిర్వహిస్తోంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలతో పాటు భారత్ ఛార్జ్ సీపీఎంఎస్ (Charge Point Management System), మొబైల్ యాప్ వంటి సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లను కూడా అభివృద్ధి చేస్తోంది. సంస్థ వ్యవస్థాపకుడు, CEO, మేనేజింగ్ పార్ట్‌నర్‌గా ప్రద్యుమ్న ఏనుగుల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ ఈ స్టార్టప్ విశేషాలను పంచుకున్నారు.

