Last Updated:
Benne Dosa: మనలో చాలా మందికి స్టార్టప్ స్టార్ట్ చెయ్యాలని ఉంటుంది. కానీ సక్సెస్ అవుతామో లేదో అని ఆలోచిస్తూనే గడిపేస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం అడుగు ముందుకు వేస్తారు. సక్సెస్ సాధించే వరకూ వదలరు. అలాంటి ఓ స్టార్టప్ సక్సెస్ కథ తెలుసుకుందాం.
అది 2024 సంవత్సరం. ముంబైలో ఓ చిన్న షాప్. ఓ 12 మంది కూర్చునేందుకు సీట్లు ఉండేవి. అలా మొదలైన ఆ రెస్టారెంట్.. ఇప్పుడు బెన్నే దోసె చైన్‌గా మారిపోయింది. రెండేళ్లలో రూ.350 కోట్ల విలువైన బిజినెస్‌గా అవతరించింది. ఈ విస్మయకరమైన వృద్ధిని ఇండస్ట్రియలిస్ట్ హర్ష గోయెంకా తన X (ట్విట్టర్) పోస్ట్‌లో విశ్లేషిస్తూ, సాధారణమైన దోసెను ఎలా హిట్ చేశారో స్పష్టంగా వివరించారు. ఈ విషయంపై NDTV Food, The Economic Times వంటి ప్రముఖ మీడియా సంస్థలు విస్తృతంగా నివేదించాయి.

