ఈ సౌకర్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మీరు మీ అకౌంట్‌లో ఒక థ్రెష్‌హోల్డ్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. అంటే.. ఉదాహరణకు రూ.25,000 లేదా రూ.50,000 అనుకోవచ్చు. సపోజ్ రూ.25,000 అనుకుంటే.. అప్పుడు మీ అకౌంట్‌లో రూ.65,000 ఉంటే.. మీరు చెప్పిన రూ.25,000 పోగా.. మిగిలిన రూ.45,000 ఆటోమేటిక్‌గా ఎఫ్‌డిగా మారుతుంది. కాబట్టి.. మీ అకౌంట్‌లో మీకు కావాల్సిన రూ.25,000 అలాగే ఉంటాయి. మీరు అందులో నుంచి రూ.5,000 వాడుకుంటే.. అప్పుడు FD నుంచి రూ.5,000 అకౌంట్‌లోకి వస్తాయి. అలా.. రూ.25,000 ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అదే మీరు మరింత మనీని అకౌంట్‌లో జమ చేస్తే, రూ.25,000 కంటే ఎక్కువ ఉన్నది.. FDతో కలుస్తుంది. కాబట్టి.. మీకు ఎప్పుడు మనీ అవసరమైనా వాడుకోవచ్చు. అదే సమయంలో FD స్థాయి వడ్డీని కూడా పొందవచ్చు. ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటివి ఈ ప్రక్రియను రోజువారీ లేదా నిర్ణీత సమయాల్లో నిర్వహిస్తున్నాయి.
