IMD ప్రకారం.. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలో జులై 23 వరకకూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయి అని IMD అంచనా వేసింది. కోస్తాంధ్ర, యానాంలో జులై 21 వరకూ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయనీ.. ఈదురు గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల దాకా పెరగగలదు అని IMD తెలిపింది. ఇదే పరిస్థితి తెలంగాణలో జులై 19 నుంచి 23 వరకూ ఉంటుంది. ఐతే.. ఈదురు గాలుల మాగ్జిమం వేగం గంటకు 50 కిలోమీటర్లుగా ఉంటుంది. IMD ప్రత్యేకంగా జులై 18న తెలంగాణలో ఉరుములతో కూడిన బలమైన గాలి (Thundersquall) వీస్తుందని చెప్పింది. అందువల్ల మనం అప్రమత్తంగా ఉండాలి. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

