Last Updated:
యంగ్ హీరో ఆది సాయి కుమార్, కోలీవుడ్ నటుడు సతీష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న కొత్త సినిమా ‘ఈగో రాజా’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్, కోలీవుడ్ నటుడు సతీష్ ప్రధాన పాత్రల్లో ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఈగో రాజా’. గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. ఇప్పటికే ‘ఈగో రాజా’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో బజ్‌ను పెంచేసింది. పోస్టర్లు, పాటలు అన్నీ కూడా హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ‘ఈగో రాజా’ నుంచి టీజర్ వదిలారు మేకర్స్.
మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్‌ను విడుదల చేసి టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘ఈ ప్రపంచమే డబ్బు వెనక పడుతోంది.. కానీ వాడు మాత్రం అలాంటి వారిలో ఒకడు కాదు.. అతనే డిజిటల్ డెవిల్..’ అంటూ విలన్ చేసే ఇల్లీగల్ పనిని చూపిస్తారు. ‘స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కడూ ఆ యాప్‌లో అప్పు తీసుకునేలా చేస్తా.. నా టార్గెట్ మంత్లీ సాలరీ తీసుకునే మిడిల్ క్లాస్ కామన్ మెన్.. ఆ కామన్ మెన్‌ను కంట్రోల్ చేయడానికి నాకు ఓ ఊర మాస్ గాడు కావాలి’.. అంటూ విలన్ చెప్పే డైలాగ్స్‌కి మాస్ ఎంట్రీతో హీరోని చూపిస్తారు.
టీజర్‌ను గమనిస్తే.. ప్రస్తుతం అందరూ ఇబ్బంది పడే సమస్యనే కేంద్రంగా చూపించినట్టు అనిపిస్తోంది. లోన్ యాప్స్.. ఆ తర్వాత వచ్చే పర్యవసనాలు, ఆత్మహత్యలు నేపథ్యంలో ‘ఈగో రాజా’ని తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. ఈ సినిమాలో హీరో పాత్రలోని ప్రయాణం, అతనిలో మార్పుకి కారణయ్యే పరిస్థితులు మరింత ఎమోషనల్‌గా ఉండబోతోన్నాయని తెలుస్తోంది.
ఆది సాయికుమార్ మాస్ లుక్, కామన్ మెన్‌లా సతీష్ పాత్ర, శరణ్య రామచంద్రన్ గ్లామర్ ఈ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. టీజర్‌లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ ఆర్ఆర్ హైలెట్ అయ్యాయి. ఆది సాయికుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఘిబ్రాన్ వైభోద సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

