Last Updated:
ఏఐ వాయిస్ క్లోనింగ్ స్కామ్‌లు పెరుగుతున్నాయి. తెలిసిన వారి గొంతుతో డబ్బులు అడిగితే, కాల్ కట్ చేసి, సేవ్ చేసిన నంబర్‌కు తిరిగి కాల్ చేసి వెరిఫై చేయాలి.
ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసగాళ్లు కూడా కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పుడు మనకు బాగా తెలిసిన వ్యక్తి గొంతును కూడా ఏఐతో కాపీ చేసి, అత్యవసర పరిస్థితి పేరుతో డబ్బులు అడిగే స్కామ్స్ పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వాయిస్‌తో స్కామర్స్ ఫోన్లు చేసి ఈజీగా మోసం చేసేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫోన్లో వినిపించే గొంతు నిజమైనదేనా కాదా తెలుసుకోవడం ఎలా? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అని సోనాటైప్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా కంట్రీ హెడ్ అభిషేక్ చౌహాన్ వివరించారు. న్యూస్18 తెలుగుతో ఆయన మాట్లాడుతూ కొన్ని టిప్స్ షేర్ చేశారు.

