Last Updated:
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నేల, సింక్, బాత్రూమ్ టైల్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టి కుళాయిలను చాలాసార్లు మర్చిపోతుంటాం. దీంతో కుళాయిల మెరుపు తగ్గి పాతవిగా కనిపిస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేకపోవచ్చు.
స్టీల్ కుళాయిలు కొత్తగా ఉన్నప్పుడు చాలా మెరుస్తూ ఉంటాయి. కానీ రోజూ నీరు పడటం, సబ్బు, నూనె, దుమ్ము వంటి కారణాలతో కొంతకాలానికి వాటిపై తెల్లటి మచ్చలు, నీటి మరకలు, ఉప్పు పొర లాంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా నీటిలో ఖనిజాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మచ్చలు త్వరగా కనిపిస్తాయి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నేల, సింక్, బాత్రూమ్ టైల్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టి కుళాయిలను చాలాసార్లు మర్చిపోతుంటాం. దీంతో కుళాయిల మెరుపు తగ్గి పాతవిగా కనిపిస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేకపోవచ్చు.

