Last Updated:
Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరుకుంది. విద్యార్థులు నివసిస్తున్న సుమారు 30 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరుకుంది. విద్యార్థులు నివసిస్తున్న సుమారు 30 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు స్పాట్‌కి చేరుకొని శిథిలాలను తొలగించేందుకు రాత్రంతా శ్రమించాయి. ‘పేయింగ్ గెస్ట్’ వసతి గృహంగా వినియోగించబడుతున్న ఆ భవనం, పేకాట ముక్కలతో కట్టిన ఇల్లులా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

