ఆదివారం ఉదయం 6:45 గంటల నుంచి 9 గంటల వరకు మహాపుజ, వేద పఠనాల మధ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మహంత్ స్వామి మహారాజ్ తొలి హారతి ఇచ్చి దేవతామూర్తులకు ప్రాణం పోశారు. శ్రీ అక్షర-పురుషోత్తం మహారాజ్ (భగవాన్ శ్రీ స్వామినారాయణ్, గుణతీతానంద్ స్వామి), శ్రీ రాధాకృష్ణులు, శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి, పార్వతీ పరమేశ్వరులు, గణేశుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామితో పాటు శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి విగ్రహాలను వేద ఆచారాలకు అనుగుణంగా ప్రతిష్టించారు.
