Last Updated:
ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఎలా ఉపయోగించాలి? నేరుగా వేడి చేయాలా లేదా ఆహారంపై పైనుంచి వేసుకోవాలా అనే సందేహాలకు నిపుణుల సూచనలు ఇవే.
ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఏం తినాలి? వంటల్లో ఎలాంటి నూనె ఉపయోగించాలి? అనే విషయాలపై చాలామంది దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ వినియోగం కూడా పెరుగుతోంది. అయితే ఆలివ్ ఆయిల్‌ను వంట చేయడానికి ఉపయోగించాలా? లేక వండిన ఆహారంపై పైనుంచి వేసుకుని తీసుకోవాలా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనిపై పోషకాహార నిపుణురాలు ఆస్మీ భట్ ఆలివ్ ఆయిల్ వినియోగానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు.

