ఎంత శుభ్రం చేసినా ఇల్లు మళ్లీ దుమ్ముతో నిండిపోతుందా..? కిటికీలు, తలుపులు మూసి ఉంచినా ఫర్నిచర్, టేబుల్స్, అల్మారాలు, ఫ్యాన్, టీవీ, ఏసీ, నేలలపై కొద్ది రోజుల్లోనే దుమ్ము పేరుకుపోతుంటుంది. దీంతో రోజూ ఇల్లు శుభ్రం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దీనికి కేవలం ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం మాత్రమే కారణం కాదని తూర్పుగోదావరికి చెందిన గృహిణి లక్ష్మి చెబుతున్నారు. బయటి దుమ్ము చిన్న చిన్న ఖాళీలు, బట్టలు, బూట్లు, పెంపుడు జంతువుల ద్వారా కూడా ఇంట్లోకి చేరుతుందని సూచిస్తున్నారు.

