3. విటమిన్లు, ప్రోటీన్ల తీవ్ర కొరత.. చర్మం తిరిగి అతుక్కోవడానికి ‘కొల్లాజెన్’ అనే ప్రోటీన్ ఉత్పత్తి కావాలి. ఆహారంలో జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ లేదా నాణ్యమైన ప్రోటీన్ లోపించినప్పుడు గాయాలు మానే ప్రక్రియ నిలిచిపోతుంది. రక్తంలో సీరం జింక్, విటమిన్ డి, విటమిన్ బి12 స్థాయిలు మరియు సీరం ఆల్బుమిన్ టెస్ట్ ద్వారా శరీర పోషకాహార స్థాయిని తెలుసుకోవచ్చు.
