Last Updated:
ప్రముఖ గ్లోబల్ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబెర్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సంస్థాగత నిర్మాణాన్ని మరింత సరళంగా, సమర్థవంతంగా మార్చే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 10 శాతం మందిని తగ్గించాలని నిర్ణయించింది. దీంతో దాదాపు 3,400 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ప్రముఖ గ్లోబల్ రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ టెక్నాలజీస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా సంస్థాగత కార్యకలాపాలను ఏకీకృతం చేయడంలో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులలో దాదాపు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రోజురోజుకూ పెరుగుతున్న పోటీని తట్టుకుని సంస్థను మరింత వేగంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే ఈ భారీ ప్రక్షాళనకు యాజమాన్యం శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతోంది.

